NTV Telugu Site icon

IND vs SA 2nd Test: టీమిండియాదే రెండో టెస్టు.. గవాస్కర్ జోస్యం!

Sunil Gavaskar New

Sunil Gavaskar New

Sunil Gavaskar Expects Indian win 2nd Test against South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భారత క్రికెట్‌ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గావస్కర్‌ జోస్యం చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో ప్రొటిస్‌ కీలక వికెట్లు కోల్పోయిందని, పేసర్లు మరోసారి విజృంభిస్తే భారత్‌ గెలుపు సాధ్యమవుతుందన్నాడు. కేప్‌టౌన్‌లో బుధవారం మొదలైన టెస్టులో దక్షిణాఫ్రికా అనూహ్య రీతిలో 55 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో కీలక మూడు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేయగా.. ఇంకా 36 పరుగుల వెనకంజలో ఉంది.

Also Read: AUS vs PAK: ఆ ముగ్గురిని ఔట్ చేయడానికి చాలా శ్రమించా: లియోన్

సునీల్ గావస్కర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ… ‘రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటికే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత్‌ ఇంకా ఆధిక్యంలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ భారత్ నుంచి చేజారిపోతుందని నేను అనుకోవడం లేదు. ప్రొటీస్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మిగిలిన ప్లేయర్స్ కలిసి 150-200 పరుగులు చేయడం కష్టమే. కాబట్టి భారత్‌కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ సేనకు ఇన్నింగ్స్‌ తేడాతో విజయం దక్కకపోయినా మంచి విజయం మాత్రం సాధ్యమే. ప్రస్తుతం భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది’ అని అన్నాడు. సెంచూరియన్‌ వేదికగా జరిగిన జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

Show comments