Site icon NTV Telugu

IND Vs SA: భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు..

Ind Vs Sa 1st T20 Highlight

Ind Vs Sa 1st T20 Highlight

IND Vs SA: ఒడిశా రాష్ట్రంలోని కటక్‌ బారాబతి స్టేడియంలో జరిగిన ఇండియా – దక్షిణాఫ్రికా తొలి T20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల తేడాతో ఇండియా సౌతాఫ్రికాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌-175/6 చేయగా, సౌతాఫ్రికా 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

READ ALSO: Y Chromosome Extinction: ప్రపంచం నుంచి పురుషులు అదృశ్యం కాబోతున్నారా?

దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా సూపర్ హిట్ ప్రదర్శన టీం ఇండియా బలమైన స్కోరును చేరుకోవడానికి విశేషంగా సహాయపడింది. పాండ్యా 28 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు బాది, T20లలో 100 సిక్సర్లు పూర్తి చేశాడు. భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌లను తప్పించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికాకు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిజానికి ఈ మ్యాచ్‌లో టీమిండియాకు అదిరే ఆరంభం లభించలేదు. కానీ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. హార్దిక్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌కు బాటలు వేశాడు. తన ఇన్సింగ్స్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు. వికెట్ కీపర్ – బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ ఐదు బంతుల్లో 10 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ (26) , అక్షర్ పటేల్ (23), అభిషేక్ శర్మ (17), శుభ్‌మాన్ గిల్ (4), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), శివమ్ దూబే (11) ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేక పోయారు. దక్షిణాఫ్రికా తరఫున లుంగి న్గిడి మూడు వికెట్లు, లూథో సిపామ్లా రెండు, డోనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ పడగొట్టారు.

ఈ లక్ష్యఛేదనలో సఫారీలు 12.3 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలారు. డెవాల్డ్ బ్రెవిస్ (22) టాప్ స్కోరర్. మార్‌క్రమ్ (14), ట్రిస్టన్ స్టబ్స్ (14), మార్కో యాన్సెన్ (12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. , హార్దిక్ పాండ్య, శివమ్ దూబె తలో వికెట్ తీశారు. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాపై విధ్వంసం సృష్టించడంతో తొలి T20Iలో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత్ ప్లేయింగ్ 11:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రూయిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్ట్జే, లూథో సిపమ్లా, లుంగీ ఎన్గిడి.

READ ALSO: Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?

Exit mobile version