NTV Telugu Site icon

India Vs Pakistan: పాకిస్థాన్‌పై ఘన విజయం.. చరిత్ర సృష్టించిన భారత్‌!

India New

India New

India record biggest victory vs Pakistan in ODI Cricket: ఆసియా కప్‌ 2023 సూపర్‌-4 దశలో భారత్ సూపర్‌ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఏకంగా 228 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్ నిర్ధేశించిన 357 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్‌ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా పేసర్లు హారిస్‌ రవూఫ్‌, నసీమ్‌ షా బ్యాటింగ్‌కు రాకపోవడంతో.. 8 వికెట్లకే పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను ముగించింది. 27 పరుగులు చేసిన ఫకర్ జమానే టాప్‌ స్కోరర్‌. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 356 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్‌ కోహ్లీ (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (111 నాటౌట్‌; 106 బంతుల్లో 12×4, 2×6) సెంచరీలతో చెలరేగారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 228 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే చరిత్రలో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం. ఇదివరకు 2008లో పాకిస్థాన్‌పై 140 పరుగుల విజయాన్ని భారత్ నమోదు చేసింది. ఇక పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే (356/2) అత్యధిక స్కోరు. గతంలో విశాఖపట్నం వేదికగా 2005లో జరిగిన మ్యాచ్‌లో దాయాదిపై భారత్‌ 9 వికెట్లకు 356 పరుగులు చేసింది.

Also Read: Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు!

విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ జోడించిన 233 పరుగులే.. ఆసియా కప్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం. ఓవరాల్‌గా పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇదే అత్యధికం. 1996లో సచిన్‌ టెండూల్కర్‌-నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధు 231 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రికార్డు తాజాగా బద్దలైంది.

Show comments