గత కొంత కాలంగా ఫామ్‌తో తంటాలు పడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51 సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో ఇది 42వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కావడం విశేషం.
పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.. ఏకైక ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీలలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడు ఈ ఘనతను అందుకోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి ఇది తొలి సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఐదు అర్ధ సెంచరీలతో 551 పరుగులు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ కూడా ఈ మూడు ట్రోఫీలలో పాకిస్థాన్‌పై సెంచరీ చేయలేదు.
Also Read: IND vs PAK: రాయుడు ఏంటి మన సెలబ్రిటీలను అంత మాటన్నాడు.. వీడియో వైరల్!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రస్తుత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి విరాట్ 82 సెంచరీలు బాదాడు. జో రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (49) మూడో స్థానంలో, స్టీవ్ స్మిత్ (48) నాలుగో స్థానంలో, కేన్ విలియమ్సన్ (47) ఐదో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (100) అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. సచిన్ రికార్డును అందుకోవాలంటే విరాట్ ఇంకా 18 శతకాలు బాదాలి. ఇదంత సులువైన పని కాదు.