IND vs PAK Set to play on October 14th in ICC ODI World Cup 2023: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారు అయింది. ఇండో-పాక్ మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. వన్డే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక రీ-షెడ్యూల్ (World Cup 2023 New Schedule) నేడు విడుదల అయ్యే అవకాశం ఉందని సదరు జాతీయ మీడియా తెలిపింది. ఐసీసీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న ఉన్న విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మ్యాచులు భారత గడ్డపై జరగనున్నాయి. అక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఉంది. అక్టోబర్ 15 నుంచే భారత్‌లో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. గుజరాత్‌లో భారీ ఎత్తున నవరాత్రులు జరగనున్నాయి. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా ఇండో-పాక్ మ్యాచ్ తేదీని మార్చాలని భారత భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించాయి. ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌లో మరికొన్ని మ్యాచ్‌ల తేదీలను కూడా మార్చాలని పలు బోర్డులు ఐసీసీకి నివేదించాయి.
Also Read: Rohit-Chahal: చహల్‌ను చితకబాదిన రోహిత్.. పక్కనే కోహ్లీ! వీడియో వైరల్
ఈ నేపథ్యంలో జులై 27న సమావేశాన్ని ఏర్పాటు చేసిన బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఒకరోజు ముందుగా.. అక్టోబర్ 14న జరగనుందట. సోమవారం వన్డే ప్రపంచకప్ 2023 కొత్త షెడ్యూల్ కూడా రానుందట. ఈ షెడ్యూల్‌ను నేడు ఐసీసీ విడుదల చేయనుంది. కొత్త షెడ్యూల్‌లో 3 నుంచి 4 మ్యాచ్‌ల డేట్స్ మారే అవకాశం ఉంది. మ్యాచ్ వేదికలో ఎలాంటి మార్పు లేకున్నా.. తేదీ మాత్రమే మారుతుందట.
Also Read: Police Bike Stunts: యూనిఫాంలో పోలీస్ బైక్ స్టంట్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అధికారులు!
India vs Pakistan set to play on October 14th in World Cup 2023.
New schedule set to come today. [Sports Tak] pic.twitter.com/jyOHH8nQof
— Johns. (@CricCrazyJohns) July 31, 2023