IND vs PAK: దోహాలో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో భారత్ A జట్టు బ్యాటింగ్ వైఫల్యం కారణంగా పాకిస్తాన్ A చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారీ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ A.. తొలి 10 ఓవర్లలో 91 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన భారత్ Aను కేవలం 136 పరుగులకే ఆలౌట్ చేసి ఆశ్చర్య పరిచింది. దీనితో 137 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ A మరో 40 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి టోర్నమెంట్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
Telangana Cold Wave: వామ్మో చలి.. ఇంకా రెండు రోజులు గజ గజ వణకాల్సిందేనట..!
మ్యాచ్ ఎలా సాగిందంటే..?
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ A జట్టులో టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ 28 బంతుల్లో 45 పరుగులు, నమన్ ధీర్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత బౌలర్లు మ్యాచ్‌ను పాకిస్తాన్ వైపు తిప్పేశారు. ముఖ్యంగా మీడియం పేసర్ షాహిద్ అజీజ్ మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మొదట సూర్యవంశీ, ధీర్ జోరు చూస్తే భారత్ A సుమారు 175 నుంచి 180 పరుగులు చేస్తుందని అనుకున్నారు. కానీ చివరి 10 ఓవర్లలో కేవలం 35 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. షాహిద్ అజీజ్‌తో పాటు సాద్ మసూద్, మాజ్ సదాకత్ చెరో రెండు వికెట్లు తీసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. గత మ్యాచ్‌లో రికార్డు సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా తనదైన మార్క్ బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. అయితే ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. ఇక ఈ వికెట్ పడటంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అజీజ్, మసూద్, సదాకత్ వంటి బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి మిగిలిన భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.
I Bomma Ravi : ఐ బొమ్మ రవి అరెస్ట్ తో పైరసీ ఆగిపోతుందా..?
లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ A ఓపెనర్ మాజ్ సదాకత్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ సూర్యవంశీ పాయింట్ వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జారవిడిచాడు. ఇక ఈయన బ్యాటింగ్ లో మాత్రమే కాకుండా.. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీసి తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో భారత్ A తమ టోర్నీలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.
