NTV Telugu Site icon

IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం: అబ్దుల్ రజాక్

Abdul Razzaq

Abdul Razzaq

India Did Not Play With Pakistan In 1997-98 says Abdul Razzaq: భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగాలేకపోవడంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తలపడుతున్నాయి. చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2022లో దాయాది దేశాలు ఢీ కొన్నాయి. ఇక వన్డే ప్రపంచకప్ 2023లో మరోసారి భారత్-పాకిస్తాన్ తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే మెగా టోర్నీ భారత గడ్డపై జరుగుతుంది కాబట్టి పాక్ వస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. పాక్ ప్రభుత్వ అనుమతి ఇస్తేనే పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ 2023లో ఆడుతుందని పీసీబీ చెబుతోంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.

వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో పాక్ మాజీ ప్లేయర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. 1997-98 సమయంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు అంటే భారత్‌కు భయం ఉండేదన్నాడు. ఓ ఇంటర్వ్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ… ‘ఇరు జట్ల ఆటగాళ్లకు పరస్పర గౌరవం మరియు స్నేహం ఉంది. కానీ పాకిస్థాన్‌తో పోటీపడని ఏకైక జట్టు భారత్ మాత్రమే. 1997-98లో పాకిస్తాన్ బలంగా ఉండేది. భారత్ ఎప్పుడూ ఓడిపోతూనే ఉండేది. ఓటములను నివారించుకునేందుకు మాతో ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇది 2023 కాబట్టి మన ఆలోచనా విధానం మార్చుకోవాలి. ఇప్పుడు ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. , మ్యాచ్ రోజున ఎవరు మంచి ప్రదర్శన చేస్తారనేదే ముఖ్యం’ అని అన్నాడు.

Also Read: Higher Pension: హయ్యర్‌ పింఛన్‌ దరఖాస్తుకు రేపటితో గడువు ముగింపు

‘ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ జట్లూ బలంగా ఉన్నాయి. పాక్ జట్టు బలహీనంగా ఉందని అనలేం. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ 2023 సిరీస్‌ను చూస్తే.. ఏ జట్టు బెటర్ అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా?. మంచి ప్రదర్శన చేసే జట్టు విజయం సాధిస్తుంది. అన్ని వదిలేసి ఇరు జట్లు ఎప్పటిలా మ్యాచ్‌లు, ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం కొనసాగించాలి’ అని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌కు వచ్చింది. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్ళింది. రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు.

Also Read: OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!