ఆసియా కప్ 2025లో బరిలోకి దిగిన టీమిండియా దూసుకుపోతోంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఈ ఎడిషన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మూడోసారి తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత్ జోరు చూస్తే.. ఫైనల్‌లో ఈజీగా గెలుస్తుంది. అయితే ఒకే ఒక్క అంశం టీమిండియాను కలవరపెడుతోంది. ఆ ఒక్క అంశంఏంటంటే.. గత రికార్డ్స్.
ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ జట్లు 12 టోర్నీ ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా నాలుగు సార్లు మాత్రమే గెలిచి.. ఏకంగా ఎనమిది సార్లు ఓడిపోయింది. పాకిస్థాన్ మాత్రం 8 విజయాలు అందుకుంది. ఈ రికార్డే ఇప్పుడు టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 5 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.
Also Read: IND vs SL: సూపర్ ఓవర్‌లో హై డ్రామా.. అంపైర్ తప్పిదం, డసన్ షనక తెలివి!
1985 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీలో పాకిస్థాన్‌తో భారత్ మొదటిసారి ఫైనల్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత పాక్ హవా నడిచింది. 1986 ఆస్ట్రల్ కప్, విల్ ట్రోఫీ 1991, ఆస్ట్రల్ కప్ 1994, సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ 1998, పెప్సీ కప్ 1999, కోకోకోలా కప్ 1999, కిట్‌ప్లై కప్ 2008, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 టోర్నీల్లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ 2025లో తొలిసారి పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్ ఆడుతోంది.
