Ind vs Pak : దుబాయ్ వేదికగా దాయాది జట్లు పాకిస్తాన్, భారత్ తలపడుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రెండు జట్లు నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి.. ఈ మ్యాచ్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టీమిండియా టి20 ఆటగాళ్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ హాజరయ్యారు. అలాగే ఏపీ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ కూడా ఈ మ్యాచ్ వీక్షించడానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. నారా లోకేష్ మ్యాచ్ వీక్షిస్తున్న ఆ ఫోటోలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కూడా పాక్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూశారు.
Read Also:AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
కాకపోతే వారు దుబాయిలో కాకుండా.. మనదేశంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ లో వీక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెలబ్రిటీలు కూడా ఇండియా, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శించడం విశేషం. భారత్, పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరైన నేపథ్యంలో.. అతడి అభిమానులు కేరింతలు కొడుతున్నారు.. కామెంట్రీ బాక్స్ లో చిరంజీవి పేరు వినిపించగానే ఎగిరి గంతులేశారు. ఒక రకంగా పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో చిరంజీవి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
Read Also:Bangladesh: ఎలాన్ మస్క్‌ని బంగ్లాదేశ్‌కి ఆహ్వానించిన యూనస్.. ఎందుకంటే..