సెప్టెంబర్ 28న జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్‌లో దాయాది భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఆసియా కప్ 2025 ఎడిషన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు 16 ఎడిషన్‌లు జరగగా.. భారత్, పాకిస్థాన్ టీమ్స్ ఒక్కసారి కూడా ఫైనల్‌లో తలపడలేదు. 2025 ఎడిషన్‌లో మొదటిసారి దాయాది దేశాలు ఫైనల్‌లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
1984లో ఆసియా కప్ మొదలైంది. అప్పట్లో మూడు జట్లతో మొదలైన ఆసియా కప్.. ఇప్పుడు 8 జట్లకు చేరింది. భారత్ 8 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకోగా.. బంగ్లాదేశ్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. అయితే ఇన్నేళ్లలో టాప్ టీమ్‌లు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడలేదు. ఆ అవకాశం ఇపుడు వచ్చింది. భారత్ 10 సార్లు ఫైనల్‌కు చేరినా ఒక్కసారి కూడా పాకిస్థాన్‌ను ఫైనల్లో ఢీకొట్టలేదు. సెప్టెంబర్ 28న జరగనున్న ఇండో-పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Weather Forecast: ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు.. ఆ రెండు జిల్లాలు మినహా..!
ఇక ఆసియా కప్‌లో ఇప్పటివరకూ ఒకే ఎడిషన్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు మ్యాచ్‌లు ఆడలేదు. నాలుగు సందర్భాల్లో రెండుసార్లు ఢీకొట్టాయి. ఈ ఎడిషన్‌లో ముచ్చటగా మూడోసారి తలపనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్ 4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ విజయం సాధించింది. ఫైనల్‌లోనూ పాక్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా టైటిల్ గెలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. నిజానికి ఆసియా కప్ 2025 మన దగ్గరే జరగాల్సి ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో యూఏఈలో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాక్‌లో జరగగా.. భారత్ మ్యాచ్‌లు మాత్రం యూఏఈల జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీ కోసం పాక్‌లు భారత్ రాకుంటే.. తాము ఆసియా కప్‌కు ఇండియా రామని పీసీబీ చెప్పిన విషయం తెలిసిందే.
