NTV Telugu Site icon

IND vs PAK: రాయుడు ఏంటి మన సెలబ్రిటీలను అంత మాటన్నాడు.. వీడియో వైరల్!

Chiranjeevi And Sukumar

Chiranjeevi And Sukumar

భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ అంటే ఆ క్రేజే వేరు. ప్రతి ఒక్కరు దాయాదుల సమరం ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్‌కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. సినీ, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియం కళకళలాడింది. మైదానం నలు మూలలా సెలబ్రిటీలు తళుక్కుమన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, పుష్ప దర్శకుడు సుకుమార్‌, ఏపీ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో కెమెరా మెన్.. సుకుమార్‌ను చూపించాడు. తెలుగు కామెంటేటర్ ఒకరు మాట్లాడుతూ.. అదిగో ‘తెలుగు భాషకు గర్వకారణం’ అంటూ సుక్కును ప్రశంసించారు. చాలా మంది తెలుగు వాళ్లు మైదానంలో ఉన్నారని, మ్యాచ్ చూడడానికి వచ్చారని పేర్కొన్నారు. కామెంటరీ చేస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ… ‘ఇలాంటి హై ఓల్టేజ్ మ్యాచ్ అంటే టీవీలో ఎక్కువగా కనిపిస్తారు కదా.. ఇది ఓ పబ్లిసిటీ స్టంట్’ అని అన్నారు. ప్రస్తుతం రాయుడు కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ‘రాయుడు ఏంటి.. మన సెలబ్రిటీలను అంత మాటన్నాడు’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Anushka Sharma: ‘కింగ్‌’ సెంచరీపై అనుష్క శర్మ రియాక్షన్‌ ఇదే!

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ హాజరయ్యారు. తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ మధ్యలో చిరంజీవి కూర్చుని మ్యాచ్ వీక్షించారు. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, శిఖర్‌ ధావన్, వెంకటేశ్‌ ప్రసాద్‌, షాహిద్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీమ్ మ్యాచ్ చూశారు. బాలీవుడ్‌ నుంచి సోనమ్‌ కపూర్‌, వివేక్‌ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా హాజరయ్యారు. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, తెలంగాణ ఐటీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ కూడా మ్యాచ్‌ను వీక్షించారు.