Mohammed Shami Record in ICC ODI World Cup: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న షమీ (5/54) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షమీ పేరు మార్మోగిపోతోంది.
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా మహమ్మద్ షమీ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లు ఆడిన షమీ.. 36 వికెట్స్ పడగొట్టాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో 12 ఇన్నింగ్స్‌ల తర్వాత షమీ సాధించిన రికార్డులను మరే బౌలర్ కూడా సాధించలేదు. అత్యధిక వికెట్లు, ఎక్కువసార్లు ఐదు వికెట్ల ఘనత, మెరుగైన యావరేజ్, తక్కువ స్ట్రైక్‌రేట్‌ను షమీ నమోదు చేశాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ స్టార్ మిచెల్ స్టార్క్ 31 వికెట్లు తీయగా.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగా 26 వికెట్లు తీసారు. చివరి మూడు వన్డేల్లో షమీ రెండుసార్లు ఐదు వికెట్స్ పడగొట్టాడు.
Also Read: Rohit Sharma: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాలేదు.. రోహిత్ శర్మ అదుర్స్!
వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మహమ్మద్ షమీకి అవకాశం లభించలేదు. అయితే హార్థిక్ పాండ్యా గాయం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్తో దూరం కాగా.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీ స్థానం దక్కించుకున్నాడు. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే మొదటి బంతికి వికెట్ తీసిన షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.