NTV Telugu Site icon

IND vs NZ: 46 పరుగులకే ఆలౌట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా చెత్త రికార్డు!

India Test Cricket

India Test Cricket

India Lowest Test Score on Home Soil: స్వదేశంలో తిరుగులేని భారత్‌కు న్యూజిలాండ్‌ భారీ షాక్ ఇచ్చింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ బౌలర్ల దెబ్బకు ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్‌ కావడం గమనార్హం. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు వికెట్లు పడగొట్టారు.

46 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేరింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో భారత్ అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇదే మొదటిసారి. 2021లో ముంబై వేదికగా జరిగిన టెస్టులో ఇదే న్యూజిలాండ్‌పై టీమిండియా 62 పరుగులు చేసింది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. 2020లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 36 రన్స్‌కే ఆలౌటైంది. 1974లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 42 పరుగులకు భారత్ కుప్పకూలింది.

Also Read: Haryana CM: హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రమాణస్వీకారం!

భారత్ అత్యల్ప స్కోర్లు ఇవే:
36 vs ఆస్ట్రేలియా (అడిలైడ్‌), 2020
42 vs ఇంగ్లండ్‌ (లార్డ్స్‌), 1974
46 vs న్యూజిలాండ్ (బెంగళూరు), 2024
58 vs ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌), 1947
58 vs ఇంగ్లండ్ (మాంచెస్టర్‌), 1952