NTV Telugu Site icon

Rohit Sharma: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కాలేదు.. రోహిత్ శర్మ అదుర్స్!

Rohit, Kohli, Bumrah

Rohit, Kohli, Bumrah

India beat New Zealand in ICC tournament after 20 years: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన రోహిత్ సేన సెమీస్‌కు మరింత చేరువైంది. ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. దాంతో గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా చెక్ పెట్టింది. అంతేకాదు 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం కూడా తీర్చుకుంది.

2003 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌పై భారత్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 146 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 3 వికెట్స్ కోల్పోయి మరో 10 ఓవర్లు ఉండగానే ఛేదించింది. అప్పటినుంచి ప్రపంచకప్‌లో భారత జట్టుపై కివీస్ ఆధిపత్యం చెలాయిస్తోంది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ విజయాన్నందుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. మ్యాచ్‌లు కివీస్‌ నెగ్గగా, భారత్ నాలుగింటిలో గెలిచింది. మాజీ సారథులు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలకు సాధ్యం కానిది రోహిత్ శర్మ చేసి చూపాడు. రోహిత్ శర్మ అదుర్స్ అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130; 127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), రచిన్ రవీంద్ర (75; 87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో చెలరేగాడు. లక్ష్య చేధనలో భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా (39 నాటౌట్; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.