IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
- ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం
- మూడో టీ20లో గెలిస్తే భారత్‌కు సిరీస్ సొంతం
- న్యూజిలాండ్‌కు మూడో టీ20 డూ ఆర్ డై మ్యాచ్
- వెల్లింగ్టన్లోని హెచ్ఎన్ఆర్వై స్టేడియంలో మ్యాచ్
- మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ దూరం కావడం కివీస్‌కు ఎదురుదెబ్బ
- ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోవడంతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు వెల్లింగ్టన్లోని హెచ్ఎన్ఆర్వై స్టేడియంలో జరిగే మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరిగా మారింది. ఇకపోతే 2026లో టీమిండియా టీ20 ప్రయాణం ఆసక్తికరంగా సాగుతోంది. ఏడాది ఆరంభంలో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుని ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. రెండు ప్రపంచకప్ ఎడిషన్లలో కలిపి భారత్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే ఓడిపోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ మార్పు నేపథ్యంలో.. ఐర్లాండ్ పర్యటనలో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఇంగ్లండ్‌లోనూ సిరీస్ పరాజయం ఎదురైంది. స్వదేశంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా లేకుండా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను 2-2తో ముగించింది.
ఇప్పుడు బౌన్సీ, గాలులతో కూడిన న్యూజిలాండ్ పరిస్థితుల్లోనూ బుమ్రా, హార్దిక్ లేకుండానే భారత్ సత్తా చాటుతోంది. తొలి మ్యాచ్‌కు ముందు కేవలం ఒక్క ప్రాక్టీస్ సెషన్ మాత్రమే లభించినప్పటికీ ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఆడిన గత పది టీ20ల్లో భారత్ ఏకంగా తొమ్మిదింటిలో విజయం సాధించింది. క్రైస్ట్చర్చ్తో పోలిస్తే వెల్లింగ్టన్లో గాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనున్నాయి. అయితే స్క్వేర్ బౌండరీలు దాదాపు 60 మీటర్లు మాత్రమే ఉండటం బ్యాటర్లకు కాస్త కలిసొచ్చే అంశం. తొలి రెండు మ్యాచ్‌లలో భారత్ తమ బౌలింగ్ ప్రణాళికలను మెరుగ్గా అమలు చేయడంతో పాటు న్యూజిలాండ్ ఫీల్డింగ్ తప్పిదాలను సద్వినియోగం చేసుకుంది. వెల్లింగ్టన్ మైదానం కొలతలకు అనుగుణంగా బౌలింగ్ వ్యూహాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
Also Read
- Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
- Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
న్యూజిలాండ్‌కు కీలక పేసర్లు మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో మాట్ హెన్రీ కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా.. మిగతా ఫార్మాట్లను దృష్టిలో పెట్టుకుని అతడిని సిరీస్ నుంచి తప్పించారు. ఫెర్గూసన్ మూడో టీ20కు మాత్రమే అందుబాటులో ఉండడు. దీంతో ఆడమ్ మిల్నే, బ్లెయిర్ టిక్నర్తో పాటు ఈ మ్యాచ్‌కు కైల్ జేమీసన్‌పై కివీస్ పేస్ బాధ్యతలు ఉండనున్నాయి. ఇక న్యూజిలాండ్ స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్ భారత బ్యాటర్లకు సవాల్ విసురుతున్నారు. తొలి రెండు మ్యాచ్‌లలో వీరిద్దరూ కలిపి 16 ఓవర్లలో 132 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తిలక్ వర్మ పేసర్లపై దూకుడుగా ఆడుతున్నప్పటికీ స్పిన్‌పై కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనపడుతుంది. ఈ సిరీస్‌లో స్పిన్‌పై అతడి స్ట్రైక్‌రేట్ 76గా ఉండగా, పేస్పై ఏకంగా 220గా ఉంది. సంజూ శాంసన్, నమన్ ధీర్ మాత్రం స్పిన్నర్లపై దూకుడుగా ఆడుతున్నారు.
మరోవైపు భారత జట్టు కాంబినేషన్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇషాన్ కిషన్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం దక్కనుంది. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ రెడ్డిని కూడా కొనసాగించే సూచనలు ఉన్నాయి. అతడు బ్యాటింగ్‌తో పాటు గత రెండు మ్యాచ్‌లలో 19వ ఓవర్‌ను సమర్థంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. అతడు ఇప్పటివరకు 26 టీ20 ఛేజింగ్‌లలో నాటౌట్‌గా నిలవగా, ఆ 26 మ్యాచ్‌ల్లోనూ అతడి జట్టు విజయం సాధించడం విశేషం. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ 2026లో ఇప్పటికే 38 వికెట్లు పడగొట్టాడు. ఫుల్ మెంబర్ దేశానికి చెందిన బౌలర్‌గా ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక టీ20 వికెట్ల రికార్డుకు అతడు కేవలం ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు.
భారత్ ప్లేయింగ్ XI (అంచనా):
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (W), వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI (అంచనా):
ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ (W), బెవాన్ జాకబ్స్/డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (C), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ.
తాజావార్తలు
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ, లేదంటే అంతే సంగతులు!
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..