IND vs NZ: బెంబేలెత్తిపోయిన బ్యాటర్లు.. భారత్ స్కోరు 34/6! నలుగురు డకౌట్

  • చెలరేగిన కివీస్‌ బౌలర్లు
  • బెంబేలెత్తిపోయిన భారత బ్యాటర్లు
  • లంచ్‌ బ్రేక్‌కు భారత్ స్కోరు 34/6
Ind Vs Nz 1st Test

Ind Vs Nz 1st Test

న్యూజిలాండ్‌ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొదటి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్‌ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్టార్ బ్యాటర్లు కుదేలయ్యారు. రోహిత్ శర్మ (2) ఖాతా తెరవగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ ఆడుకుంటేనే భారత్ కోలుకుంటుంది.

Also Read: Radhika Apte Pregnant: పెళ్లైన 12 ఏళ్లకు.. తల్లవుతోన్న టాలీవుడ్ హీరోయిన్!

వ‌ర్షం వ‌ల్ల మొద‌టి రోజు ఆట ర‌ద్దు కాగా.. రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కివీస్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. మొద‌టి సెష‌న్‌లో భారత్ టాప్ ఆర్డ‌ర్ చేతులెత్తేసింది. పరుగుల సంగతి పక్కన పెడితే.. బంతిని ఎదుర్కోవాలంటే భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్ (15 నాటౌట్) మాత్రమే ఇప్పటివరకు డబుల్‌ డిజిట్స్ స్కోర్ అందుకున్నారు. కివీస్ బౌలర్లు విలియమ్ ఓరౌర్కీ (3/13), మ్యాట్ హెన్రీ (2/12), టిమ్ సౌథీ (1/8)లు వికెట్స్ తీశారు.