Ireland vs India Schedule 2023: వచ్చే నెల నుంచి భారత జట్టు వరుస షెడ్యూల్‌లతో బిజీబిజీగా గడపనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 అనంతరం నెల రోజుల విరామం తీసుకున్న భారత్.. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లను ఆడేందుకు భారత్ వెళ్లనుంది. విండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఐర్లాండ్‌తో సిరీస్ ఆడనుంది. ఈ షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం రాత్రి విడుదల చేసినట్లు ఐసీసీ పేర్కొంది. ఐర్లాండ్‌తో భారత్ మూడు టీ20లు ఆడనుంది.
ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ఆగస్ట్ 18న మొదలవుతుంది. ఆగస్ట్ 18న తొలి టీ20, ఆగస్ట్ 20న రెండో టీ20, ఆగస్ట్ 23న మూడో టీ20 జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లకు డబ్లిన్‌లోని మలాహిడే గ్రౌండ్స్ వేదిక కానుంది. వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే (ఆగస్ట్ 13) ఐర్లాండ్ సిరీస్ మొదలవుతుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో ఈ టీ20 సిరీస్‌కు సీనియర్ ప్లేయర్స్ దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. యువ జట్టును బీసీసీఐ ఐర్లాండ్‌కు పంపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ICC World Cup 2023: సచిన్ కోసం 2011 ప్రపంచకప్ గెలిచాం.. 2023 ట్రోఫీ అతడి కోసం గెలవండి: సెహ్వాగ్
గతేడాది ఐర్లాండ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌ను హార్దిక్ పాండ్యా నేతృత్వంలోనే భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో దీపక్ హుడా (104) సెంచరీ చేశాడు. 2018లో ఐర్లాండ్‌లో పర్యటించిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. మొత్తంగా భారత్, ఐర్లాండ్ మధ్య 5 మ్యాచ్‌లు జరగ్గా.. అన్నింటిలోనూ టీమిండియానే గెలుపొందింది.
ఐర్లాండ్, భారత్ షెడ్యూల్ (IND vs IRE Schedule 2023):
ఆగస్ట్ 18: తొలి టీ20 మ్యాచ్ (మలాహిడే)
ఆగస్ట్ 20: రెండో టీ20 మ్యాచ్ (మలాహిడే)
ఆగస్ట్ 23: మూడో టీ20 మ్యాచ్ (మలాహిడే)