IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను! ప్రయోగాలకు వేళాయే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ireland vs India 3rd T20I Preview: ఐర్లాండ్, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్ టీమిండియాకు చక్కని అవకాశం.
ఆసియా కప్ 2023 ముందు గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం జట్టుకు కలిసొచ్చే విషయం. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు మూడో టీ20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నారు. నిలకడగా రాణించలేకపోతున్న పేసర్ అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో అవేష్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సంజు శాంసన్‌కు విశ్రాంతిని ఇచ్చి వికెట్ కీపర్ జితేశ్ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. అయితే ఆసియా కప్ 2023కి బ్యాకప్ కీపర్‌గా శాంసన్ ఎంపిక కావడంతో కొనసాగించే అవకాశం లేకపోలేదు.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
వాషింగ్టన్ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్ అహ్మద్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. రెండో టీ20తో అరంగేట్రం చేసి అదరగొట్టిన రింకూ సింగ్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక రెండు టీ20ల్లో విఫలమయిన తిలక్ వర్మ ఈసారి సత్తాచాలని చూస్తున్నాడు. యువ భారత్ మరోసారి ఐర్లాండ్‌ను చిత్తుచేయాలని చూస్తోంది.
రెండు టీ20 మ్యాచ్‌లలో ఐర్లాండ్ ఆటతీరు పేలవంగా లేకున్నా.. యువ భారత్‌కు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. అందులకే చివరి టీ20లో ఐరిష్ జట్టు చెలరేగే అవకాశం ఉంది. గతంలో మంచి ప్రదర్శనలు చేసినా టీమిండియాను ఓడించడంలో ఐర్లాండ్ సఫలం కాలేకపోయింది. ఇక డబ్లిన్‌లో వాతావరణంనేడు మబ్బు పట్టి ఉంటుంది. ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నా.. మ్యాచ్ పూర్తిగా జరగొచ్చు.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!