Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng Telugu Fans Are Disappointed As Virat Kohli Has Dropped Out Of The First Two Tests

IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!

Published Date :January 23, 2024 , 7:21 am
By Sampath Kumar
IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఆదివారమే హైదరాబాద్‌ చేరుకున్నారు.

‘వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు మ్యాచ్‌ల నుంచి తప్పించాలని బోర్డుకు విరాట్‌ కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, జట్టు మేనేజ్‌మెంట్‌, సెలక్టర్లతో విరాట్ మాట్లాడాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడానికే ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తానని చెప్పిన కోహ్లీ.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో ఉండలేనన్నాడు. విరాట్ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది. బోర్డు, టీమ్‌మేనేజ్‌మెంట్‌ అతడికి మద్దతు తెలిపాయి’ అని ప్రకటనలో బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. విరాట్ ఏకాంతాన్ని గౌరవించాలని.. అతడి వ్యక్తిగత కారణాలపై ఊహాగానాలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది.

విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇటీవల అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కూడా వ్యక్తిగత కారణాలతో విరామం తీసుకున్నాడు. 2021లో టెస్టు సిరీస్‌ సందర్భంగా విరాట్ విరామం తీసుకున్నాడు. అప్పుడు భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడు కూడా అనుష్క గర్భవతి. ఆమెను దగ్గరుండి తీసుకోవడం కోసమే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: China : చైనాలో కొండచరియలు విరిగిపడి.. 8 మంది మృతి, 39 మంది గల్లంతు

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో తొలి టెస్టు, ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరగనుంది. విరాట్ కోహ్లీ ఫాన్స్ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు టెస్టుల నుంచి అతడు తప్పుకోవడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • IND vs ENG 1st Test
  • Telugu Fans
  • VIRAT KOHLI
  • Virat Kohli latest news

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions