NTV Telugu Site icon

IND vs ENG: ఇది నేను అస్సలు ఊహించలేదు: జోస్ బట్లర్

Jos Buttler Speech

Jos Buttler Speech

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ… ‘ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో మా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. త్వరగా వికెట్లను చేజార్చుకోవడంతో వెనకపడిపోయాం. వికెట్స్ చేతిలో ఉంటే భారీ లక్ష్యం విధించే అవకాశం ఉండేది. పిచ్‌ పొరపాటు ఏమీ లేదు. భారత బౌలర్లు పరిస్థితులను బాగా సద్వినియోగం చేసుకున్నారు. స్పిన్నర్లు అద్భుత బంతులు వేశారు’ అని ప్రశంసించాడు. ఈ మ్యాచులో బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 రన్స్ చేశాడు.

Also Read: Gold Rate Today: ఆల్‌టైమ్ హైకి గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా!

‘లోపాలను సరిదిద్దుకొని తర్వాత మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం. జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లోకి రావడం ఆనందంగా ఉంది. మంచి బంతులు వేశాడు. మార్క్‌ వుడ్‌ వేగవంతమైన బౌలర్. ఈ మ్యాచులో కూడా అతడి స్పీడ్‌ అద్భుతం. దూకుడగా ఆడే టీమిండియాను అడ్డుకోవాలంటే.. ఏ చిన్న అవకాశంను మిస్‌ చేసుకోకూడదు. కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పని చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా. మెక్‌కల్లమ్‌కు నేను అతిపెద్ద అభిమానిని. అతడితో డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకోవడం బాగుంది’ అని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేర్కొన్నాడు.