IND vs ENG: భారత్ జోరును ఇంగ్లాండ్ అడ్డుకుంటుందా! నేడే రెండో టి20
- నేడే భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్.
- చెన్నై వేదికగా టీ20 మ్యాచ్.
- సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో పునరాగమనం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
Also Read: KCR: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ఇకపోతే, చెన్నై పిచ్ స్పిన్ బౌలర్లకు ఎక్కువ మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్ లో మహ్మద్ షమీ ఆడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హార్దిక్ పాండ్యా రూపంలో రెండో పేసర్‌తో భారత్ బరిలోకి దిగనుంది. ఇక ఇరు జట్ల మధ్య టి20లో రికార్డ్స్ పరంగా చూస్తే..
Also Read: Health Tips: రోజూ వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? మీరు చేసే తప్పులివే!
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు మొత్తం 25 టీ20 మ్యాచ్‌లు జరగగా.. వీటిలో టీమ్ ఇండియా 14 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయించగా, ఇంగ్లాండ్ జట్టు ఇప్పటివరకు భారత్‌పై 11 విజయాలు సాధించింది. ఇక చెన్నైలోని స్టేడియం ఇప్పటివరకు కేవలం రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది. 2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1 పరుగు తేడాతో ఓడిపోగా, చివరిసారిగా 2018లో చెపాక్‌లో వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా తలపడింది. ఆ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. నేడు మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!