Site icon NTV Telugu

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

Team India 1014 Runs

Team India 1014 Runs

BCCI Update India Squad for 4th vs England: జులై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ కోసం మార్పులతో భారత జట్టును (అప్‌డేట్ టీమ్) బీసీసీఐ ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ నితీష్ కుమార్ రెడ్డి ఎడమ మోకాలి గాయం కారణంగా మిగిలిన రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఎడమ బొటన వేలు గాయం కారణంగా నాల్గవ టెస్ట్‌లో ఆడడం లేదు. అర్ష్‌దీప్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కాంబోజ్ ఇప్పటికే మాంచెస్టర్‌లో భారత జట్టులో చేరాడు.

గాయం బారిన పడిన పేసర్ ఆకాష్ దీప్ మాంచెస్టర్ టెస్ట్‌కు అందుబాటులోనే ఉన్నాడు. ఆకాష్ నాలుగో టెస్టులో ఆడుతాడో లేదో చూడాలి. నితీశ్‌ కుమార్ రెడ్డికి బదులు మరలా శార్దూల్‌ ఠాకూర్ ఆడే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా లేదా మహమ్మద్ సిరాజ్‌లలో ఒకరికి విశ్రాంతి ఇచ్చి.. అర్ష్‌దీప్‌ సింగ్‌ను అరంగేట్రం చేయిద్దామని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అది సాధ్యపడదు. బుమ్రా, సిరాజ్‌ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకరికి రెస్ట్ ఇచ్చి ప్రసిద్ధ్ కృష్ణ లేదా అన్షుల్ కాంబోజ్‌ను దింపే అవకాశాలు లేకపోలేదు. రిషభ్‌ పంత్ గాయంపై స్పష్టత లేదు. దాంతో ఇప్పుడు నాలుగో టెస్ట్ భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. చూడాలి మరి మాంచెస్టర్లో ఎవరు ఆడుతారో.

Also Read: Viral Video: 2 రూపాయలకే షర్ట్.. ఎగబడిన యువకులు! చివరకు..

నాల్గవ టెస్టు కోసం అప్‌డేట్ టీమ్:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.

Exit mobile version