IND vs ENG 3rd Test Playing 11 Out: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ కోసం రోహిత్ ఏకంగా నాలుగు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాగా.. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లు అరంగేట్రం చేశారు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్, కేఎస్ భారత్ స్థానంలో జురెల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పసర్లతో బరిలోకి దిగుతోంది.
ఇంగ్లండ్ టీమ్ ఒకరోజు ముందుగానే తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తుది జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ షోయబ్ బషీర్‌ను తప్పించి.. మార్క్ వుడ్‌కు చోటు కల్పించింది. తొలి రెండు టెస్టుల్లో ఒకే పేసర్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లను ఆడిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ సిరీస్‌లో జరిగిన రెండు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (కీపర్), ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.