IND vs ENG 3rd Test: రాజ్‌కోట్ రివర్స్ స్వింగ్‌కు అనుకూలం.. బుమ్రా చెలరేగిపోతాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zaheer Khan React on IND vs ENG 3rd Test Rajkot Pitch: హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్‌కోట్‌లో పిచ్ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. రాజ్‌కోట్‌లో రివర్స్ స్వింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఒవైస్ షా పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు భారత్, ఇంగ్లండ్ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జియో సినిమాతో జహీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న పిచ్‌ల మాదిరిగానే రాజ్‌కోట్ పిచ్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇలాంటి పిచ్‌పై తొలి రెండు రోజులు బ్యాటుకు, బంతికీ మధ్య మంచి పోటీని మనం చూడొచ్చు. అయితే మూడో రోజు స్పిన్ తిరుగుతుంది. కొంత రివర్స్ స్వింగూ అవుతుంది. నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రేక్షకులు ఈ టెస్టును ఎంతో ఆస్వాదిస్తారు’ అని అన్నాడు.
Also Read
Also Read: IND vs ENG 3rd Test: భారత్, ఇంగ్లండ్ మూడో టెస్ట్.. ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం!
జహీర్ ఖాన్ వ్యాఖ్యలతో మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ ఒవైస్ షా ఏకీభవించాడు. జస్ప్రీత్ బుమ్రా మరియు ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు అని పేర్కొన్నాడు. ‘జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోంది. ఎందుకంటే.. రాజ్‌కోట్‌లో బుమ్రా రివర్స్ స్వింగ్ చేయగలుగుతాడు. ఇదే జరిగితే ప్రేక్షకులందరు ఆనందిస్తారు. పాత బంతితో బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. బుమ్రా పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడమే అందుకు కారణం’ అని ఒవైస్ షా చెప్పాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!