Site icon NTV Telugu

IND vs ENG 3rd Test: రాజ్‌కోట్ రివర్స్ స్వింగ్‌కు అనుకూలం.. బుమ్రా చెలరేగిపోతాడు!

Jasprit Bumrah 5 Wickets

Jasprit Bumrah 5 Wickets

Zaheer Khan React on IND vs ENG 3rd Test Rajkot Pitch: హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఉన్నట్లే రాజ్‌కోట్‌లో పిచ్‌ ఉంటుందని టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ అన్నాడు. రాజ్‌కోట్‌లో రివర్స్‌ స్వింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్‌ ఆర్డర్‌ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోందని ఇంగ్లీష్ మాజీ ఆటగాడు ఒవైస్‌ షా పేర్కొన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో మ్యాచ్‌కు భారత్‌, ఇంగ్లండ్‌ సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టుకు ఇరు జట్లు వ్యూహ, ప్రతి వ్యూహాలతో పోటీకి దిగుతున్నాయి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

జియో సినిమాతో జహీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ… ‘హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న పిచ్‌ల మాదిరిగానే రాజ్‌కోట్‌ పిచ్ ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఇలాంటి పిచ్‌పై తొలి రెండు రోజులు బ్యాటుకు, బంతికీ మధ్య మంచి పోటీని మనం చూడొచ్చు. అయితే మూడో రోజు స్పిన్‌ తిరుగుతుంది. కొంత రివర్స్‌ స్వింగూ అవుతుంది. నాలుగు, ఐదు రోజుల్లో స్పిన్నర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ప్రేక్షకులు ఈ టెస్టును ఎంతో ఆస్వాదిస్తారు’ అని అన్నాడు.

Also Read: IND vs ENG 3rd Test: భారత్‌, ఇంగ్లండ్‌ మూడో టెస్ట్‌.. ముగ్గురు ఆటగాళ్లకు చాలా ప్రత్యేకం!

జహీర్ ఖాన్ వ్యాఖ్యలతో మాజీ ఇంగ్లండ్ బ్యాటర్ ఒవైస్ షా ఏకీభవించాడు. జస్ప్రీత్ బుమ్రా మరియు ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ల మధ్య హోరాహోరీ సమరం తప్పదు అని పేర్కొన్నాడు. ‘జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ మిడిల్ ఆర్డర్ మధ్య హోరాహోరీ సమరం జరగబోతోంది. ఎందుకంటే.. రాజ్‌కోట్‌లో బుమ్రా రివర్స్‌ స్వింగ్‌ చేయగలుగుతాడు. ఇదే జరిగితే ప్రేక్షకులందరు ఆనందిస్తారు. పాత బంతితో బౌలింగ్ చేస్తే ఇంగ్లండ్ బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. బుమ్రా పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టడమే అందుకు కారణం’ అని ఒవైస్ షా చెప్పాడు.

Exit mobile version