Site icon NTV Telugu

IND vs ENG: బుమ్రాకు కాస్త మద్దతు ఇయ్యండయ్యా!

Bumrah

Bumrah

లీడ్స్‌ ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. మరోసారి భారత బౌలింగ్‌ బలహీనత బయటపడింది. తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్స్ తీసినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. మొహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్‌ కృష్ణలు పరుగులు ఇవ్వడం భారత్‌ ఓటమికి కారణమైంది. టీమిండియా బౌలర్ల వైఫల్యంతో 370కి పైగా టార్గెట్‌ను ఛేదించింది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్‌ యూనిట్‌పై సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసహనం వ్యక్తం చేశాడు. బుమ్రాకు మిగతా బౌలర్లు కాస్త మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

Also Read: Prashant Kishor: హీటెక్కుతున్న బీహార్ పాలిటిక్స్.. రాహుల్‌గాంధీకి సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్

‘మొదటి టెస్టులో భారత్ ఓటమిని ఎదుర్కోవాల్సింది కాదు. టీమిండియా బౌలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. బుమ్రా నుంచి మిగతా బౌలర్లు నేర్చుకోవాలి. అతడితో మాట్లాడి.. ఎలా బౌలింగ్‌ చేయాలనేది ప్రణాళిక వేసుకోవాలి. బుమ్రాకు మద్దతుగా నిలిస్తేనే.. మనం సులువుగా విజయం సాధించగలం. నేను మొదటి టెస్ట్ మ్యాచ్‌ గురించి మాట్లాడుతున్నా. బౌలింగ్‌ విభాగం సత్తా చాటాలి. శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీశారు. శార్దూల్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీసినా.. అప్పటికే భారత్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ వెళ్ళిపోయింది. కొత్త బంతితో వికెట్లు తీయడం ఎప్పుడూ ముఖ్యం. తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడానికి కారణం భారత బౌలర్లు పరుగులు ఇవ్వడమే. మన బౌలింగ్‌ విభాగం బలంగా మారడానికి ఏం చేయాలనే మార్గాలను వెతకాలి’ అని మహ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version