NTV Telugu Site icon

IND vs China Asian Champions Trophy 2024: భారత్ vs చైనా.. నేడే ఫైనల్

Ind Vs China Asian Champions Trophy 2024

Ind Vs China Asian Champions Trophy 2024

IND vs China Asian Champions Trophy 2024: భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. కాగా, మరోవైపు చైనా పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ దక్కించుకుంది. నిర్ణీత సమయం తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లో పాకిస్థాన్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. గ్రూప్ రౌండ్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కాగా, చైనా 6 మ్యాచ్‌ల్లో మూడు పరాజయాలను చవిచూసింది. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాను ఓడించింది.

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు ఇవే

భారత్ వర్సెస్ చైనా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న చైనాలోని హులున్‌బుయిర్‌లో జరగనుంది. పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, చైనాలు మధ్యాహ్నం 1:15 గంటలకు (IST) తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ సోనీ స్పోర్ట్స్ టెన్ 1, టెన్ 1 HD ఛానెల్‌ లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది . ఇండియా వర్సెస్ చైనా మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ SonyLIV యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం కోసం బాహుబలి సూపర్ క్రేన్..

భారత జట్టు ఇలా ఉండబోతున్నట్లు అంచనా..

గోల్ కీపర్లు: కృష్ణ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా.
డిఫెండర్లు: హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, జగరాజ్ సింగ్, సంజయ్, సుమిత్, అమిత్ రోహిదాస్.
మిడ్ ఫీల్డర్లు: వివేక్ సాగర్ ప్రసాద్ (వైస్ కెప్టెన్), మన్ ప్రీత్ సింగ్, మహ్మద్ రషీల్ ముస్సిన్, రాజ్ కుమార్ పాల్, నీలకాంత్ శర్మ.
ఫార్వర్డ్‌లు: అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్, అరేజిత్ సింగ్ హుందాల్, ఉత్తమ్ సింగ్, గుర్జోత్ సింగ్.

Show comments