Site icon NTV Telugu

U19 Asia Cup 2024: ఆసియా కప్‌ 2024 ఫైనల్.. బౌలింగ్‌ ఎంచుకున్న భారత్!

Ind Vs Ban Final

Ind Vs Ban Final

అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్‌ మరికొద్దిసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభం కానుంది. భారత్, బంగ్లాదేశ్‌ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచులో టాస్‌ గెలిచిన యువ భారత్ కెప్టెన్ మహ్మద్ అమన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గతేడాది సెమీస్‌లో బంగ్లా చేతిలోనే భారత్ ఓడింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

తుది జట్లు:
భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ కార్తికేయ, నిఖిల్ కుమార్‌, హర్వాన్ష్‌ పంగాలియా, హార్దిక్ రాజ్, కిరన్ ఖోర్మలే, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా.
బంగ్లాదేశ్‌: జావద్ అబ్రార్, కలామ్‌ సిద్దికి, అజిజుల్ హకీం (కెప్టెన్), షిహాబ్ జేమ్స్, రిజాన్ హోసన్, ఫరిద్ హసన్, దేబాశిశ్‌ దెబా, సిమియన్ బసిర్, అల్‌ ఫహద్, ఇక్బాల్, మారుఫ్.

 

Exit mobile version