NTV Telugu Site icon

Rohit Sharma: మరో 10 పరుగులే.. అరుదైన రికార్డుపై రోహిత్‌ శర్మ కన్ను! తొలి కెప్టెన్‌గా..

Rohit Sharma Test

Rohit Sharma Test

Rohit Sharma Eye on Big Record in IND vs BAN Test Series: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. హిట్‌మ్యాన్‌ మరో 10 పరుగులు చేస్తే.. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి కెప్టెన్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఈ ఏడాదిలో రోహిత్‌ మూడు ఫార్మాట్లలో 25 ఇన్నింగ్స్‌ ఆడి.. 990 పరుగులు చేశాడు. మరో 10 రన్స్ చేస్తే.. అరుదైన రికార్డు ఖాతాలో చేరుతుంది.

2024లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక బ్యాటర్ పథుమ్‌ నిసాంక పేరిట ఉంది. ఇప్పటివరకు నిసాంక 25 ఇన్నింగ్స్‌ల్లో 1135 రన్స్ చేశాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుసాల్‌ మెండిస్‌ రెండో స్థానంలో (1111) ఉన్నాడు. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (1033) మూడో స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ (990) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ (986) టాప్-5లో కొనసాగుతున్నాడు.

Also Read: Paralympic 2024: పారాలింపిక్స్‌ విజేతలకు భారీ నజరానా.. పసిడికి రూ.75 లక్షలు!

టెస్ట్‌ సిరీస్‌, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్‌ చెన్నై వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానుంది. రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 27 నుంచి మొదలవుతుంది. అక్టోబర్‌ 6న గ్వాలియర్‌లో మొదటి టీ20, అక్టోబర్‌ 9న ఢిల్లీలో రెండో టీ20, అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో మూడో టీ20 జరగనుంది. టెస్టుల్లో రోహిత్ శర్మ, టీ20లలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తారు.