NTV Telugu Site icon

Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్‌!

Ravichandran Ashwin Record

Ravichandran Ashwin Record

Ravichandran Ashwin Breaks Nathan Lyon Record: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ అదరగొట్టాడు. ముందుగా బ్యాట్‌తో ఆదుకున్న యాష్.. ఆపై బంతితో తిప్పేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ (113) చేసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ పడగొట్టాడు. దాంతో టెస్ట్‌లో పలు రికార్డులు బద్ధలు కొట్టాడు. ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్‌ను యాష్ వెనక్కి నెట్టేశాడు.

ఆర్ అశ్విన్‌ 522 వికెట్లతో 9వ స్థానంలోకి వచ్చాడు. కోట్నీ వాల్ష్‌ 519 వికెట్లతో తొమ్మిదో స్థానానికి పరిమితం అయ్యాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (800) అగ్ర స్థానంలో ఉన్నాడు. షేన్ వార్న్‌ (708), జేమ్స్ అండర్సన్‌ (704), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్‌ బ్రాడ్‌ (604), గ్లెన్ మెక్‌గ్రాత్‌ (563), నాథన్ లయన్‌ (530) మాత్రమే అశ్విన్‌ కంటే ముందున్నారు. మరో 9 వికెట్లు తీస్తే లయన్‌ను దాటేస్తాడు. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టులో చెలరేగితే అశ్విన్ పైకి ఎగబాకుతాడు.

Also Read: IND vs BAN: 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. భారత్‌కు ప్రత్యేకంగా చెన్నై టెస్ట్!

అయితే నాథన్ లయన్‌ మరో రికార్డును మాత్రం ఆర్ అశ్విన్‌ బ్రేక్ చేశాడు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో అత్యధిక సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఫీట్‌ను యాష్‌ మొత్తం 11 సార్లు సాధించాడు. ఈ జాబితాలో నాథన్ లయన్‌ (10), ప్యాట్ కమిన్స్‌ (8), జస్ప్రీత్ బుమ్రా (7), జోష్ హజిల్‌వుడ్‌ (6), టీమ్ సౌథీ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.