NTV Telugu Site icon

IND vs BAN: అదే మా కొంపముంచింది: బంగ్లా కెప్టెన్ శాంటో

Najmul Hossain Shanto Interview

Najmul Hossain Shanto Interview

Najmul Hossain Shanto Said We didn’t bat well against India: తొలి టీ20 ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ కొంపముంచిందని చెప్పాడు. టీ20లో తొలి ఆరు ఓవర్లు చాలా ముఖ్యమైనవని, తమకు సరైన ఆరంభం దక్కలేదని తెలిపాడు. టీ20 అంటే బాదడం మాత్రమే కాదని, వికెట్లు చేతిలో ఉంచుకుంటే మంచి స్కోరు సాధించవచ్చని శాంటో పేర్కొన్నాడు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్‌తో జరిగిన మొదటి టీ20లో ఓడిపోయింది. బ్యాటింగ్‌లో విఫలమైన బంగ్లా మూల్యం చెల్లించుకుంది.

మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో మాట్లాడుతూ… ‘మాకు సరైన ఆరంభం దక్కలేదు. టీ20ల్లో మొదటి 6 ఓవర్లు ముఖ్యం. కానీ పవర్ ప్లేలో మేం రాణించలేకపోయాం. పాజిటీవ్ క్రికెట్ ఆడాలనేది మా ప్లాన్. కానీ మేం కుదురుకోవడానికి కొన్ని ఓవర్లు ఆడాల్సి వచ్చింది. మేం సరైన ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. తర్వాతి మ్యాచ్‌కు మంచి ప్రణాళికలతో రావాలి. స్ట్రైక్ రోటేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. టీ20 అంటే బాదడం మాత్రమే కాదు. వికెట్లు చేతిలో ఉంటే మంచి స్కోర్ చేయవచ్చు. ఈ మ్యాచ్‌లో మేం ఎక్కువ పరుగులు చేయలేదు. రిషద్, ముస్తాఫిజుర్ బాగా బౌలింగ్‌ చేశారు. కానీ మేము పోరాడానికి కావాల్సిన పరుగులు చేయలేదు. ఈ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణం’ అని చెప్పాడు.

Also Read: Suryakumar Yadav: అది పెద్ద తలనొప్పి అయ్యింది: సూర్యకుమార్

భారత బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/14), వరుణ్‌ చక్రవర్తి (3/31), మయాంక్‌ యాదవ్‌ (1/21) ధాటికి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 19.5 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. మెహిదీ హసన్‌ మిరాజ్‌ (35 నాటౌట్‌; 32 బంతుల్లో 3×4), నజ్ముల్‌ శాంటో (27; 25 బంతుల్లో 1×4, 1×6) పర్వాలేదనిపించారు. కీలక బ్యాటర్లు లిటన్‌ దాస్‌ (4), మహ్మదుల్లా (1)లు నిరాశపరిచారు. అక్టోబర్ 9న ఢిల్లీలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.