IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్ చేయను: ముష్పీకర్ రహీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mushfiqur Rahim Said Virat Kohli always tries to sledge me: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తాను ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయను అని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పీకర్ రహీమ్ తెలిపాడు. స్లెడ్జింగ్ కోహ్లీలో మరింత ఉత్సాహన్ని కలిగిస్తుందని, అప్పుడు విరాట్ ఇంకా దూకుడుగా ఆడతాడన్నాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా అతడిని వదిలించుకోవాలని తమ బౌలర్లకు చెప్తానని రహీమ్ చెప్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం మధ్యాహ్నం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ కీపర్ ముష్పీకర్ రహీమ్ పలు విషయాలపై స్పందించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని స్లెడ్జ్ చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ‘అమ్మో అక్కడుంది కింగ్ కోహ్లీ.. నేనెప్పుడూ అతడిని స్లెడ్జ్ చేయను’ అని ముష్పీకర్ రహీమ్ తెలిపాడు. అందుకు గల కారణాన్ని కూడా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ వెల్లడించాడు. ‘ప్రపంచ క్రికెట్‌లో కొంతమంది బ్యాటర్లు స్లెడ్జింగ్‌ను బాగా ఇష్టపడతారు. స్లెడ్జింగ్ చేస్తే వారు మరింత ఉత్సాహంగా ఆడతారు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ ముందువరసలో ఉంటాడు. అందుకే నేను ఎప్పుడూ కోహ్లీని స్లెడ్జ్ చేయను. స్లెడ్జింగ్ చేస్తే కోహ్లీ మరింత రెచ్చిపోయి ఆడతాడు. స్లెడ్జింగ్ చేయకుండా వీలైనంత త్వరగా కోహ్లీని ఔట్ చేయాలనీ మా బౌలర్లకు చెప్తాను’ అని ముష్పీకర్ పేర్కొన్నాడు.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Also Read: IND vs BAN: భారత్ భయపెడుతోంది.. అయినా మా రికార్డు మెరుగ్గా ఉంది: బంగ్లాదేశ్ కోచ్
‘నేను భారత్‌తో బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ విరాట్ కోహ్లీ నన్ను స్లెడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీ పోటీతత్వం గల క్రికెటర్. ఏ మ్యాచ్‌లోనూ తన జట్టు ఓడిపోవాలనుకోడు. కోహ్లీలో ఉన్న ఆ పోటీని, భారత్‌ను ఎదుర్కోవడంలో ఎదురయ్యే సవాల్ నాకెంతో ఇష్టం. ప్రపంచకప్ 2023లో భాగంగా నేను టీమిండియాతో రేపు మ్యాచ్ ఆడబోతున్నా. చాలా ఆసక్తిగా ఉన్నా’ అని ముష్పీకర్ రహీమ్ చెప్పాడు. బంగ్లాదేశ్‌తో 26 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 65.31 సగటుతో 1437 పరుగులు చేశాడు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన భారత్.. నాలుగో విజయంపై కన్నేసింది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?