NTV Telugu Site icon

Hardik Pandya Shot: ఏంటి హార్దిక్‌.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా! వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

Hardik Pandya Shot

Hardik Pandya Shot

Hardik Pandya No-Look Shot Video: ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2024 భారత్ గెలవడంతో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో సూపర్ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికాను వణికించాడు. హార్దిక్ అదే ఫామ్‌ను కంటిన్యూ చుస్తున్నాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే హార్దిక్ కొట్టిన ఓ షాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.

Also Read: IND vs BAN: ఇది నాకు రీబర్త్‌డే.. భావోద్వేగానికి గురైన టీమిండియా ప్లేయర్!

గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్ రిషద్ హొస్సేన్ వేసిన 11వ ఓవర్‌ నాలుగో బంతికి సూపర్ సిక్స్‌ కొట్టాడు. డీప్ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా స్టాండ్స్‌లోకి బంతిని పంపాడు. ఆ తరువాత తస్కిన్ అహ్మద్ వేసిన 12వ ఓవర్లోని మూడో బంతికి హార్దిక్ అద్భుతమైన షాట్ ఆడాడు. ‘నో-లుక్’ షాట్ ఆడగా.. కీపర్ తలా మీదుగా బంతి బౌండరీ దాటేసింది. షాట్ తర్వాత హార్దిక్ బంతిని చూడనే లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హార్దిక్ షాట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘ఏంటి హార్దిక్‌.. ఇలా కూడా షాట్ ఆడొచ్చా’ అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Show comments