IND vs BAN: పాకిస్తాన్‌పై భారీ విజయాన్ని సాధించిన భారత్.. ఆసియా కప్ 2025 సూపర్ 4లో తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో నేడు (సెప్టెంబర్ 24) తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల పాత్ర కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య జరిగిన 17 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో బంగ్లాదేశ్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించగలిగింది. గణాంకాల పరంగా చూస్తే భారత జట్టు స్పష్టమైన ఫేవరెట్‌గా నిలుస్తోంది. అయితే, చిన్న ఫార్మాట్ కావడంతో బంగ్లాదేశ్ స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేస్తే ఆటలో ట్విస్ట్ రావచ్చు.
TheyCallHimOG : బెజవాడలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన OG
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు జోష్ లో కనిపిస్తోంది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫఖర్ జమాన్ వికెట్‌ను తీసి యూజవేంద్ర చాహల్ రికార్డును అధిగమించిన హార్దిక్ పాండ్యా భారత తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టెలికాస్ట్ కానుండగా.. సోనీ లివ్ యాప్, వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కానుంది. ఇక నేటి మ్యాచ్ కు ఇరు జట్లను ఇలా అంచనా వేయవచ్చు.
Crime News: రాజధానిలో ఆగని క్రైమ్.. మరో మృతదేహం కలకలం
భారత్ (India):
అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ సాంసన్, శివమ్ డూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి / అర్షదీప్, బుమ్రా
బంగ్లాదేశ్ (Bangladesh):
ఎస్ హసాన్, టీ హసాన్, దాస్, హ్రిదయ్, హోస్సైన్, అలీ, ఎం హసన్, అహ్మద్, అహ్మద్, ఇస్లాం, రహ్మాన్.
