NTV Telugu Site icon

Kanpur Test: మూడో రోజు ఆట ఆలస్యం.. 12 గంటలకు మరోసారి పిచ్‌ పరిశీలన!

Kanpur Test

Kanpur Test

IND vs BAN 2nd Test Day 3 Updates: కాన్పూర్ వేదికగా మొదలైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మొదటి రోజు ఆటలో 35 ఓవర్లు మాత్రమే పడగా.. రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం ఇంకా ఆట ఆరంభం కాలేదు. వర్షం పడుకున్నా.. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్‌ ఇంకా మొదలవ్వలేదు. మూడో రోజు ఆట మొదలవ్వడానికి మరింత ఆలస్యమవనుంది.

ఇప్పటికే ఓసారి మైదానంను పరిశీలించిన అంపైర్లు.. మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి పరిశీలించనున్నారు. అనంతరం ఆట ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా వర్షం మరోసారి పడితే మాత్రం మూడో రోజు ఆట కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం గ్రౌండ్ స్టాఫ్ మైదానాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. చివరి రెండు రోజులకు మాత్రం వర్షం ముప్పు లేదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.

Also Read: Samsung Galaxy S24 FE: ‘గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ’ వచ్చేసింది.. ధర,ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్‌ చేసింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లా 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మొమినుల్‌ హక్‌ (40), ముష్ఫికర్‌ రహీమ్‌ (6) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, అశ్విన్‌ 1 వికెట్‌ పడగొట్టారు. నజ్ముల్ హోస్సేన్ షాంటో (31), షెడ్‌మన్ ఇస్లామ్ (24), జకీర్ హసన్ (0) రన్స్ చేశారు.

Show comments