కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దైంది. రెండో రోజు మాదిరిగానే.. ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దైంది. మూడో రోజైన ఆదివారం వర్షం లేకపోయినా.. మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. మూడోసారి పరిశీలించిన అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటలకు పిచ్, మైదానాన్ని అంపైర్లు పరిశీలించారు. మైదానం చిత్తడిగా…
IND vs BAN 2nd Test Day 3 Updates: కాన్పూర్ వేదికగా మొదలైన భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారింది. మొదటి రోజు ఆటలో 35 ఓవర్లు మాత్రమే పడగా.. రెండో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మూడో రోజైన ఆదివారం ఇంకా ఆట ఆరంభం కాలేదు. వర్షం పడుకున్నా.. గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఇంకా మొదలవ్వలేదు. మూడో రోజు ఆట మొదలవ్వడానికి మరింత ఆలస్యమవనుంది. ఇప్పటికే…