NTV Telugu Site icon

IND vs BAN: కోహ్లీ కాళ్లు మొక్కిన గ్రౌండ్ సిబ్బంది.. వీడియో వైరల్!

Virat Kohli Fan

Virat Kohli Fan

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 16 ఏళ్లుగా అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారతదేశంలోనే కాదు.. దాయాది పాకిస్తాన్‌లో కూడా మనోడికి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోసం ఫాన్స్ బారికేడ్లు దాటిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కోహ్లీ కాళ్లను తాకి తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఓ అభిమాని కోహ్లీపై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.

కాన్పూర్‌ వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్‌ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌కు ముందు గ్రీన్ పార్క్ మైదానంలో వర్షం పడటంతో.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. అంపైర్లు ఫీల్డ్‌ను తనిఖీ చేస్తుండగా.. కొందరు సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు సాధన కోసం గ్రౌండ్‌లోకి వచ్చారు. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వస్తుండగా.. గ్రౌండ్ సిబ్బంది ఒకరు కింగ్ వద్దకు వెళ్లి అతడి పాదాలకు నమస్కరించాడు. విరాట్ కూడా అతడికి మర్యాద ఇస్తూ.. వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్యాడ్‌లైట్ కారణంగా భారత్, బంగ్లా రెండో టెస్టు ఆట నిలిచిపోయింది. చినుకులు పడుతుండటంతో అవుట్‌ ఫీల్డ్‌లోని చాలా ప్రాంతాలను గ్రౌండ్స్‌మెన్ కవర్లతో కప్పి ఉంచారు. ఫ్లండ్‌లైట్స్ ఆన్‌ చేసిన తర్వాత ఆట కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగ్లా స్కోరు 35 ఓవర్లకు 107/3గా ఉంది. క్రీజ్‌లో ముష్ఫికర్ (6), మొమినల్ హక్ (40) ఉన్నారు.