NTV Telugu Site icon

Rishabh Pant Angry: నన్నెందుకు కొడుతున్నారు.. బంగ్లా ప్లేయర్‌పై పంత్ ఆగ్రహం!

Rishabh Pant Angry

Rishabh Pant Angry

అందరూ ఊహించినట్లుగానే జరుగుతోంది. ఇటీవల పాకిస్థాన్‌ను దాని సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. అదే ఊపులో భారత్‌నూ దెబ్బ కొడుతోంది. భారత టాప్‌ ఆర్డర్‌కు బంగ్లా పేసర్ హసన్ మహ్మద్ చుక్కలు చూపించాడు. హసన్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) త్వక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ సమయంలో రిషబ్ పంత్ (39)తో కలిసి యశస్వి జైస్వాల్ (56) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 62 పరుగులు జోడించారు.

లంచ్‌ బ్రేక్‌ అనంతరం కాసేపటికే హసన్ మహ్మద్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. అయితే అంతకుముందు పరుగు తీస్తున్న క్రమంలో బంగ్లా ప్లేయర్‌ లిటన్‌ దాస్‌పై పంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ను తస్కిన్ అహ్మద్ వేశాడు. మూడో బంతికి షాట్ ఆడిన యశస్వి జైస్వాల్.. సింగిల్‌ కోసం పరుగెత్తాడు. సమయంలో ఫీల్డర్ విసిరిన బంతి స్ట్రైకింగ్‌ వైపు దూసుకొస్తున్న పంత్ ప్యాడ్లను బలంగా తాకింది. మరో పరుగు కోసం ప్రయత్నించి ఆగిపోయిన పంత్.. లిటన్ దాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నన్నెందుకు కొడుతున్నారు’ అంటూ పంత్ అతడితో అన్నాడు. ఈ వ్యాఖ్యలు అక్కడి స్టంప్స్‌ మైక్స్‌లో రికార్డు అయ్యాయి. లిటన్‌ దాస్‌ ఏదో అంటూ తన పొజిషన్‌కు వెళ్లిపోయాడు.

Also Read: IND vs BAN: పెవిలియన్‌కు భారత బ్యాటర్లు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ యువ పేసర్!

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 144 పరుగులకే 6 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌ స్కోరు 48 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (7), రవిచంద్రన్ అశ్విన్ (21) ఉన్నారు. యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ (56) చేయగా.. రిషబ్ పంత్ (39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ (16) తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. హసన్ మహ్మద్ నాలుగు వికెట్స్ పడగొట్టాడు.

Show comments