IND vs AUS: మొన్న గిల్, నిన్న జితేష్.. ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?
- మొన్న గిల్, నిన్న జితేష్
- ఇక సంజు శాంసన్ పనైపోయినట్లేనా?
- సంజు భవిష్యత్తు ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసనే. గత 12 నెలల్లో సంజు మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు జట్టులో చోటిచ్చేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్ మారింది. గిల్ కారణంగా ఓపెనింగ్ చేసే సంజు.. మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. ఇప్పుడు జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఇక సంజు మరలా తిరిగి జట్టులో రావడమా కష్టమేనా?
ఆసియా కప్ 2025కు ముందు జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం లభిస్తుందని, శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని భావించారు. కానీ జట్టు యాజమాన్యం సంజు శాంసన్‌ను ఎంచుకుని.. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయం కొంతవరకు విజయవంతమైంది. టోర్నీలో సంజు రాణించాడు. ఫైనల్‌లో తిలక్ వర్మ, సంజు భాగస్వామ్యం టిమిండియాను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చింది. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో అతడిని 5వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. సూర్యకుమార్ యాదవ్‌ను కాన్‌బెర్రాలో 3వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. మెల్‌బోర్న్‌లో సంజు 3వ స్థానంలో వచ్చినా ఫలితం లేకుండా పోయింది. మూడవ మ్యాచ్ (హోబార్ట్)లో జితేష్ శర్మకు మిడిల్ ఆర్డర్‌లో అవకాశం దక్కింది.
Also Read
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
- ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
నిజం చెప్పాలంటే.. హోబార్ట్ మ్యాచ్‌లో జితేష్ శర్మ బాగా ఆడాడు. చివరి రెండు మ్యాచ్‌లలో అతడే కొనసాగనున్నాడు. జితేష్ రాకతో ఇప్పుడు రాబోయే నెలల్లో సంజు శాంసన్ భవిష్యత్తు ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. జితేష్ మిడిల్ ఆర్డర్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటే.. ఇక సంజుకు జట్టులో స్థానం ఉండదు. సంజు ఓపెనర్‌గా చాలా పరుగులు చేశాడు. మూడు సెంచరీలు కూడా చేశాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు స్థానం కల్పించడానికి అతనిపై వేటు వేశారు. సంజు 5వ స్థానంలో అంతగా విజయవంతం కాలేదు. కానీ ఆ స్థానంలో తగినంత అవకాశాలు లభించాయా? అంటే లేదనే చెప్పాలి. ఆస్ట్రేలియాలో 3వ స్థానంలో ఒకే ఒక్కసారి బ్యాటింగ్ చేసి విఫలమయ్యాడు. నిజానికి గిల్, సూర్య కూడా ఆ మ్యాచ్‌లో విఫలమయ్యారు. ముగ్గురూ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ పరిస్థితిలో ఒకే ఒక్క వైఫల్యం తర్వాత సంజును తొలగించడం న్యాయమా?. మూడో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. కాబట్టి సంజు భవిష్యత్తు ఏమిటి?. అతన్ని రెండవ వికెట్ కీపర్‌గా ఉంచుతారా లేదా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం అతనికి కష్టమేనా? ఇక అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజావార్తలు
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
-
Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
-
Archana: బిగిల్ నిర్మాతకు సీఎం విజయ్ కీలక పదవి
-
Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
-
Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!