NTV Telugu Site icon

IND vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్.. విజేత కెప్టెన్‌కు ట్రోఫీని అందజేయనున్న..! లక్కీ ఫెలో

India Vs Australia Final 2023

India Vs Australia Final 2023

PM Modi to hand over World Cup 2023 Trophy to winning captain: అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్ 19న భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే ప్రపంచకప్‌ 2023 తుది పోరు జరగనుంది. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకోగా.. గురువారం కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అతి కష్టంమీద గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్స్ మ్యాచ్ కోసం నరేంద్ర మోడీ స్టేడియం అంగరంగ వైభవంగా సిద్ధమైంది.

భారత్‌-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంకు రానున్నారని తెలుస్తోంది. మ్యాచ్ ఆసాంతం ప్రధాని మైదానంలోనే ఉండనున్నారట. అంతేకాదు ప్రపంచకప్‌ 2023 విన్నింగ్ టీమ్ కెప్టెన్‌కు ప్రధాని ట్రోఫీని అందించే అవకాశాలు ఉన్నాయి. మెహ టోర్నీ విజేత జట్టు సారథి మోడీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ లక్ ఎవరిని వరించనుందో ఆదివారం రాత్రి తెలిసిపోతుంది.

Also Read: Quinton de Kock: క్వింటన్‌ డికాక్‌ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు ప్రపంచకప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కూడా ఈ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బెనీస్ సహా మాజీలు చాలా మంది హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియం వద్ద గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. లోకల్, పారా మిలటరీ, కేంద్రీయ రిజర్వ్ పోలీస్ దళాలు రంగంలోకి దిగనున్నాయి.