NTV Telugu Site icon

IND vs AUS: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. ప్రతిఘటిస్తున్న ఆసీస్ బ్యాటర్స్

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: భారత్ – ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుండగా.. రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఇక రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా బౌలర్లు ఆధిపత్యాన్ని చూపించారు. ఆస్ట్రేలియా రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ లో 26 ఓవర్లలో 92 పరుగులు చేసింది. ఇదే సమయంలో టీమిండియా 4 వికెట్లను కూడా సాధించింది. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ చెరొక వికెట్ తీశారు. క్రీజులో వెబ్‌స్టర్‌తో పాటు అలెక్స్ కారీ ఉన్నాడు.

Also Read: Tragedy On Vacation: విహారయాత్రలో విషాదం.. బీటెక్ విద్యార్ధి మృతి

రెండో రోజు ఆరంభం టీమిండియా అద్భుతంగా ప్రారంభించింది. జస్ప్రీత్ బుమ్రా నాలుగో ఓవర్‌లో మార్నస్ లాబుషాగ్నే (2)ని అవుట్ చేయడం ద్వారా భారత్‌కు రెండో వికెట్ ను అందించాడు. దీని తర్వాత మహ్మద్ సిరాజ్ సామ్ కాన్స్టాంట్స్ (23) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 12వ ఓవర్‌లోనే ప్రమాదకరమైన ట్రావిస్‌ హెడ్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్ లో స్లిప్‌లో కేఎల్‌ రాహుల్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఒక సమయంలో ఆస్ట్రేలియా 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, వెబ్‌స్టర్ మధ్య ఐదో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని 28వ ఓవర్‌లో 33 పరుగుల వద్ద స్మిత్‌ను అవుట్ చేయడం ద్వారా ప్రసిద్ధ్ కృష్ణ బ్రేక్ చేసాడు.

Show comments