NTV Telugu Site icon

IND vs AUS: భారత బౌలర్ల దాటికి కంగారులు విలవిల.. స్వల్ప ఆధిక్యంలో భారత్

Ind Vs Aus

Ind Vs Aus

IND vs AUS: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంలోని సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 4 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్ట్రేలియా తరఫున బ్యూ వెబ్‌స్టర్ 57 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, నితీష్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.

Also Read: Game Changer : “డాకు మహారాజ్” ట్రైలర్ కోసం రంగంలోకి “గేమ్ ఛేంజర్” ఎడిటర్

ఇది ఇలా ఉండగా, జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా అభిమానులకు టెన్షన్ పెంచాడు. గాయం కారణంగా బుమ్రా గ్రౌండ్ నుండి బయటకు వెళ్ళాడు. బుమ్రా ఎప్పుడు, ఎక్కడ గాయపడ్డాడో స్పష్టంగా తెలియనప్పటికీ, ఆట మధ్యలోనే అతనిని స్కాన్ కోసం ఆసుపత్రికి వెళ్లడం సంబంధించిన వీడియో కనిపించింది. దింతో టీమిండియా అభిమానులు `బుమ్రాకు ఏమి కాకూడదని, వీలైనంత త్వరగా మల్లి టీంలో చేరాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

Also Read: Mid Day Meal In Colleges: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

Show comments