Mitchell Marsh celebrates World Cup victory with legs over cup: ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. దాంతో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్ 2023 ట్రోఫీ గెలిచిన ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ట్రోఫీ పట్టుకుని సందడి చేశారు. ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్ చేసిన ఓ పని క్రికెట్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీని మైదానం నుంచి ఆస్ట్రేలియా ఆటగాళ్లు హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆసీస్ ప్లేయర్స్ మరోసారి ట్రోఫీతో ఫొటోస్ దిగారు. మిచెల్ మార్ష్ సోఫాలో కూర్చుని.. ప్రపంచకప్ 2023 ట్రోఫీపై తన రెండు కాళ్లు పెట్టి ఫొటోలకు పోజులిచ్ఛాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న కొన్ని గంటల తర్వాత ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ ఫోటోను తొలుత ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఆపై వైరల్ అయింది. ఇది చూసిన ఫాన్స్ అతడిపై మండిపడుతున్నారు. ప్రపంచకప్‌కు కాస్త గౌరవం ఇవ్వు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మిచెల్ మార్ష్.. అంత బలుపు అనవసరం అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు.
Also Read: Pat Cummins: ఆడు మగాడ్రా బుజ్జి.. అన్నంత పని చేశాడు!
ఆస్ట్రేలియన్ జట్టు ప్లేయర్స్ హోటల్ గదిలో కూర్చుని ఆహ్లాదంగా సంభాషించుకుంటున్న ఫోటో కనిపిస్తోంది. ఆపై ప్లేయర్స్ అందరూ పార్టీ చేసుకున్నారట. భారత గడ్డపై ట్రోఫీ కైవసం చేసుకున్న ఆసీస్.. టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇక ప్రపంచకప్ 2023 ఫైనల్లో మిచెల్ మార్ష్ 15 రన్స్ చేశాడు. 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ బాదిన మిచెల్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. మెగా టోర్నీలో మిచెల్ మార్ష్ 441 రన్స్ చేశాడు.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023