NTV Telugu Site icon

IND VS AUS: ఓపెనర్‌గా రోహిత్ శర్మ.. 3 పరుగులకే ఔట్‌! ఆసీస్‌ స్కోరు 474/10

Rohit Sharma Out

Rohit Sharma Out

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. సామ్ కాన్‌స్టాస్ (60), ఉస్మాన్ ఖవాజా (57), మార్నస్ లబుషేన్ (72) హాఫ్ సెంచరీలు బాదారు. కెప్టెన్ పాట్ కమిన్స్ (49) తృటిలో అర్ధ శతకం కోల్పోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: IND VS AUS: నల్ల బ్యాడ్జ్‌లతో టీమిండియా ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?

తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు షాక్‌ తగిలింది. గత రెండు టెస్టులో మిడిల్ ఆర్డర్లో ఆడిన రోహిత్‌ శర్మ.. బాక్సింగ్‌ డే టెస్టులో ఓపెనర్‌గా వచ్చి 3 పరుగులకే ఔట్‌ అయ్యాడు. రెండో ఓవర్‌లో ప్యాట్ కమిన్స్‌ వేసిన చివరి బంతికి రోహిత్‌ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో కూడా హిట్‌మ్యాన్ విఫలమయ్యాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకున్నారు. ఇద్దరు కలిసి 42 రన్స్ జోడించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 14 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 రన్స్ చేసింది. యశస్వి జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (24)లు క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 423 రన్స్ వెనకపడి ఉంది.

Show comments