బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను వెంటాడి మరీ ఔట్ అవుతున్నాడు. ట్రోఫీలో ఓ సెంచరీ మినహా అన్ని ఇన్నింగ్స్‌లలో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దాంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. గురువారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. ఆఫ్‌సైడ్ బంతులను వదిలేసే విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నాడు.
Also Read: Srikakulam Sherlock Holmes Review: ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ!
‘విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పేస్, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లపై విరాట్ ఆడాడు. ఇప్పుడు మెల్‌బోర్న్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. క్రీజ్‌లో పాతుకుపోతే.. పరుగులు చేయడం పెద్ద కష్టమేం కాదు. అయితే ఆఫ్‌సైడ్ బంతులను వెంటాడి ఔటయ్యే విరాట్.. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కవర్ డ్రైవ్‌లను ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అవుతున్నాడు. గతంలో సచిన్ కూడా ఓ సమయంలో ఇలానే ఇబ్బందిపడ్డాడు. ఆ తర్వాత ఆఫ్‌సైడ్ కవర్ డ్రైవ్ ఆడలేదు. ఇప్పుడు విరాట్ కూడా అదే పని చేయాలి’ అని మాథ్యూ హేడెన్ సూచించాడు.