బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా.. మిడిలార్డర్లో ఆడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో కేఎల్ రాహుల్ రాణించడంతో.. హిట్‌మ్యాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు టెస్టుల్లో రోహిత్ విఫలమయ్యాడు. మిడిలార్డర్లో హిట్‌మ్యాన్ విఫలమవుతుండడంతో తిరిగి ఓపెనర్ అవతారం ఎత్తుతాడా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీనిపై రోహిత్‌ను ప్రశ్నిస్తే.. తాను జవాబు చెప్పను అని తెలిపాడు. గురువారం ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ విలేకరులతో మాట్లాడాడు.
Also Read: PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!
మీరు మరలా ఓపెనర్‌గా ఆడుతారా? అనే ప్రశకు రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘జట్టులో ఎవరు ఎక్కడ ఆడతారు అనే దానిపై చింత అక్కర్లేదు. దాని గురించి ఇక్కడ చర్చ అనవసరం. మేం అంతర్గతంగా మాట్లాడకుంటాం, జట్టుకు ఏది ఉత్తమమో మాకు తెలుసు. ఇక్కడ ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పను’ అన్నాడు. ఆఫ్‌స్టంప్ ఆవల పడే బంతులను విరాట్ కోహ్లీ వెంటాడి ఔటవడంపై హిట్‌మ్యాన్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ ఆధునిక దిగ్గజం అని మీరే అంటున్నారు కదా. అలాంటి గొప్ప ప్లేయర్ తమ సమస్యను తామే పరిష్కరించుకోగలడు. అతడిపై నమ్మకం ఉంది. విరాట్ పరుగులు చేస్తాడు’ అని ధీమా వ్యక్తం చేశాడు.