NTV Telugu Site icon

Gabba Test: గబ్బా టెస్ట్‌.. వ్యూహం మార్చిన టీమిండియా!

Team India Test

Team India Test

వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి మ్యాచ్‌ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్‌ జోడిని కొనసాగించారు. దాంతో హిట్‌మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్‌గా రాహుల్‌ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది. సీమర్లకు స్వర్గధామమైన గబ్బా మైదానంలో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సాధారణంగా నెట్స్‌లో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఓపెనర్లు వస్తారు. బ్రిస్బేన్‌లో జరిగిన సెషన్‌లలో రోహిత్‌ శర్మ కూడా త్వరగానే వచ్చి ప్రాక్టీస్ చేశాడు. బంతి మెరుపు కోల్పోని సమయంలోనే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ల బౌలింగ్‌లో సాధన చేశాడు. దీంతో గబ్బాలో రోహిత్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీమర్లను ఎదుర్కోవడంలో హిట్‌మ్యాన్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా భారత్ ఈ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?

ఇక టీమిండియా సెషన్స్‌ మొత్తంను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ తన కోచింగ్‌ బృందంతో కలిసి పర్యవేక్షించాడు. విరాట్‌ కోహ్లీతో గౌతీ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం టీమ్ ప్లేయర్స్ ఫీల్డింగ్‌ డ్రిల్స్‌ చేశారు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పెర్త్ టెస్టులో భారత్‌ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది.

Show comments