NTV Telugu Site icon

Ind Vs Aus : అతడికి విశ్రాంతి..? యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్..!

Ind Vs Aus

Ind Vs Aus

వన్డే సిరీస్ లో నిర్ణయాత్మక మ్యాచ్ కు టీమిండియా-ఆస్ట్రేలియా సిద్దమయ్యాయి. చెన్నై వేదికగా ఇరు జట్ల మధ్య కాసేపట్లో ఆఖరి వన్డే జరుగనుంది. ఈ సిరీస్ గెలిచిన వాళ్లే విజేతగా నిలవనున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలుపొందాలని టీమిండియా పట్టుదలగా ఉండగా.. ఇప్పటికే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోల్పోయిన ఆసీస్ వన్డేల్లోనైనా పైచేయి సాధించాలని చూస్తోంది. కాగా.. భారత్-ఆసీస్ ఆఖరి వన్డే మ్యాచ్ జరిగే చెపాక్ స్టేడియం చాలా కాలంగా స్పిన్ కు అనుకూలం. ఇక్కడ భారీ స్కోర్లు ఎక్కువగా నమోదు కాలేదు. ఈసారీ అలాగే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వరుసగా రెండు వన్డేల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ కు తుది జట్టులో ఖాయమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Also Read : Bollaram President residence: నేటి నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఎంట్రీ

అయితే, వైజాగ్ వన్డేలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్-2023 నేపథ్యంలో మహ్మద్ షమీపై పనిభారం తగ్గించాలని భావిస్తే ఉమ్రాన్ మాలిక్ ఆఖరి వన్డేలో ఆడే అవకాశం ఉంది. ఇక ఆసీస్ విషయానికోస్తే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రానుండగా.. రెండు వన్డేల్లో దుమ్ములేపిన మిచెల్ మార్ష్ మిడిలార్డర్ లో ఆడే అవకాశం ఉంది. కాగా కాసేపట్లో జరిగే మ్యాచ్ కు వర్ష సూచన లేదని తెలిపారు.

Also Read : Illegal Relationship : తల్లి ప్రియుడిని చంపిన కొడుకు.. జార్ఖండ్‌లో ఘోరం

టీమిండియా జట్టు : రోహిత్ శర్మ ( కెప్టెన్ ), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమీ/ ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్.. ఆస్ట్రేలియా జట్టు : స్టీవ్ స్మిత్ (కెప్టెన్ ), డేవిడ్ వార్నర్, ట్రావిడ్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టొయినీస్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా లుత తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.