NTV Telugu Site icon

IND vs AUS 3rd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆరు మార్పులతో బరిలోకి భారత్! ఇషాన్, అశ్విన్ ఔట్

Kuldeep, Sundar

Kuldeep, Sundar

Cummins, Starc and Maxwell Play IND vs AUS 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఐదు మార్పులు చేసినట్లు కమిన్స్ చెప్పాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ అందుబాటులోకి వచ్చారని.. తన్వీర్ సంఘా అరంగేట్రం చేస్తున్నాడని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ భారీ మార్పులు చేసింది. మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ తిరిగి జట్టుతో కలిశారు. రెండో మ్యాచ్ ఆడని మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాల తుది జట్టులోకి వచ్చారు. గత రెండు వన్డేల్లో భాగమైన టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు వైరల్‌ ఫీవర్‌ కారణంగా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ జట్టుకు దూరమయ్యాడు. వైరల్‌ ఫీవర్‌ కారణంగానే హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఆడడం లేదు.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్‌.