NTV Telugu Site icon

IND vs AUS: బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి చెప్పొద్దన్నారు: కేఎల్‌ రాహుల్‌

Kl Rahul Test

Kl Rahul Test

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా అడిలైడ్‌ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. అడిలైడ్‌ కోసం సిద్దమైంది. డే/నైట్‌ మ్యాచ్‌గా జరిగే ఈ పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్‌ శర్మ, శుభ్‌మ‌న్ గిల్ అందుబాటులోకి రావడంతో.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. గిల్ మూడో స్థానంలో రానుండగా.. ఇప్పుడు యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌ ఎవరు చేస్తారని ఆసక్తిగా మారింది.

తొలి టెస్టులో కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కీలక పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్‌ శర్మ జట్టులోకి రావడంతో.. రాహుల్ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పింక్ బాల్ టెస్టుకు ముందు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రాహుల్ పాల్గొనగా.. రెండో టెస్టులో మీరు ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారో చెప్తారా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు రాహుల్ బదులిస్తూ.. టీమ్ మేనేజ్మెంట్ నాకు చెప్పింది కానీ.. మీతో ఆ విషయాన్ని పంచుకోవద్దంది’ అని పేర్కొన్నాడు. దాంతో అక్కడ నవ్వులు విరిశాయి. అనంతరం మాట్లాడుతూ.. తాను ఏ ప్లేస్‌లోనైనా ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ఓపెనింగ్‌, మిడిల్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా తాను ఆడతానని.. జట్టు కోసం ఏదైనా చేయాలన్నారు. తాను తుది జట్టులో మాత్రం ఉండాలనుకుంటున్నా అని రాహుల్ తెలిపాడు.

Also Read: Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌ కన్ఫర్మ్.. హీరో ఎవరో తెలుసా?

‘నేను చాలా స్థానాల్లో బ్యాటింగ్‌ చేశాను. తొలి 20-25 బంతులను ఎలా ఎదుర్కోవాలో మానసికంగా సవాలుగా ఉండేది. ఎంత తొందరగా అటాక్‌ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ షాట్ ఆడాలి.. లాంటి విషయాలలు కెరీర్ ఆరంభంలో నా మదిలోకి వచ్చేవి. వాటన్నింటిని నేను అధిగమించా. ప్రస్తుతం టెస్టు, వన్డేల్లో అన్ని స్థానాల్లో ఆడుతున్నా. ఇప్పుడు నా ఇన్నింగ్స్‌ను ఎలా మేనేజ్‌ చేసుకోవాలో తెలుసు. ఎక్కడ బ్యాటింగ్‌ చేసినా తొలి 30 బంతులను సమర్థంగా ఎదుర్కొంటే.. ఆ తర్వాత బ్యాటింగ్‌ ఈజీ అవుతుంది. నేను ఎప్పుడూ దీనిపైనే దృష్టి పెడతా’ అని కేఎల్ రాహుల్‌ వివరించాడు.

Show comments